
ముంబై,16డిసెంబర్ (హి.స.) అటు దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు మంగళవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు పతనమవగా.. నిఫ్టీ 25,900 మార్క్‌ను కోల్పోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 499 పాయింట్లు దిగజారి 84,714 వద్ద, నిఫ్టీ 154 పాయింట్ల నష్టంతో 25,873 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, మదుపర్ల అప్రమత్తత సూచీలను ఒత్తిడికి గురిచేస్తున్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ