
ఢిల్లీ 16,డిసెంబర్ (హి.స.)
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దిల్లీ- ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రహదారిపై పొగమంచు కారణంగా ఏడు బస్సులు, మూడు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. మరో 75 మంది గాయపడినట్లు తెలిపారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలోని ఆగ్రా- నోయిడా క్యారేజ్ వేపై ఈ ప్రమాదం జరిగింది.
దట్టమైన పొగమంచు వల్ల వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో భారీగా మంటలు చెలరేగాయని.. బస్సులు, కార్లు నిమిషాల్లోనే దగ్ధమయ్యాయన్నారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక దళాలు, పోలీసు బృందాలు, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు అదుపు చేసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ