
ఢిల్లీ 16,డిసెంబర్ (హి.స.) శ్రీనగర్, కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ఓట్ చోరి, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశాలు ఆ పార్టీ సొంత అజెండా అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ఈ అంశాలతో విపక్ష ఇండియా కూటమికి ఎలాంటి సంబంధమూ లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రతి పార్టీకి సొంత అజెండా నిర్దేశించుకునే స్వేచ్ఛ ఉందని, కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరి, ఎస్‌ఐఆర్ అంశాలను ఎంచుకుందన్నారు. కాంగ్రెస్ వాళ్లేం చేయాలో నిర్దేశించలేం కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి వెంటిలేటర్‌పై ఉందని ఆయన బిహార్‌లో కూటమి పరాజయం తర్వాత వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ