ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. విమాన, రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం
ఢి ల్లీ, 16 డిసెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలు మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచుతో కమ్ముకుపోయాయి. వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరడంతో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్ప
dense-fog-in-delhi-severe-disruption-to-air-and-rail-traffic-


ఢి ల్లీ, 16 డిసెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలు మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచుతో కమ్ముకుపోయాయి. వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరడంతో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు ప్రభావంతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 228కు పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 800కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఐదు విమానాలను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. పొగమంచు కారణంగా రద్దైన విమానాల టికెట్లకు రీషెడ్యూల్ లేదా రీఫండ్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. మరోవైపు రైల్వే అధికారులు పలు రైళ్లు 6 నుంచి 7 గంటల వరకు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లడించారు. పరిస్థితిని నియంత్రించేందుకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద అత్యంత కఠినమైన స్టేజ్-IV ఆంక్షలను అమలు చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో అన్ని రకాల నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధం విధించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా 10వ తరగతి మినహా మిగిలిన తరగతులకు హైబ్రిడ్ విధానంలో తరగతులు నిర్వహించాలని పాఠశాలలకు సూచించారు. మరోవైపు భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేస్తూ, రానున్న రోజుల్లోనూ పొగమంచు తీవ్రత కొనసాగవచ్చని హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande