
ఢిల్లీ, 16 డిసెంబర్ (హి.స.)1971 యుద్ధంలో భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ధైర్యవంతులైన సైనికులను (Vijay Diwas) విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ స్మరించుకున్నారు. మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన సందేశం పోస్ట్ చేశారు. ‘1971లో భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని సాధింపజేసిన ధైర్యశాలి సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాలను ఈ రోజు మనం స్మరించుకుంటున్నాం. వారి అచంచలమైన సంకల్పం, నిస్వార్థ సేవ మన దేశాన్ని రక్షించాయి. మన చరిత్రలో గర్వించదగిన క్షణాన్ని లిఖించాయి. వారి వీరత్వం తరతరాల భారతీయులకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. విజయ్ దివస్ భారత సైనికుల అసమాన ధైర్యానికి, త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సైనికుల వీరత్వానికి దేశం కృతజ్ఞతలు తెలుపుతోందని ప్రధాని స్పష్టం చేశారు. ట్వీట్ ఇదే..
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV