
మాచర్ల, 16 డిసెంబర్ (హి.స.)పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆరబోయిన ధాన్యం కారణంగా కారు బోల్తాపడింది. కారు వేగంలో ఉండటంతో కారు ఎగిరిపడగా అందులో ప్రయాణిస్తున్న బొప్పన నాగమణి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV