రూపాయి బేజారు.. తొలిసారి 91 మార్క్‌ దాటి..
ముంబయి/ఢిల్లీ 16,డిసెంబర్ (హి.స.) : అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకూ క్షీణిస్తోంది. భారత్‌-అమెరికా డీల్‌పై అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో రూపాయి మారకం విలువ (Rupee Value) దారుణంగా పడిపోతోంది. నేటి సెషన
రూపాయి బేజారు.. తొలిసారి 91 మార్క్‌ దాటి..


ముంబయి/ఢిల్లీ 16,డిసెంబర్ (హి.స.) : అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకూ క్షీణిస్తోంది. భారత్‌-అమెరికా డీల్‌పై అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో రూపాయి మారకం విలువ (Rupee Value) దారుణంగా పడిపోతోంది. నేటి సెషన్‌లో తొలిసారి ఏకంగా 91 మార్క్‌ దాటి సరికొత్త జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. (Dollar Rupee Valur)

క్రితం సెషన్‌లో డాలరుతో పోలిస్తే 90.78 వద్ద ముగిసిన రూపాయి విలువ.. మంగళవారం మరింత పతనమైంది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ఏకంగా 36 పైసలు తగ్గి 91.14 వద్ద ఆల్‌టైం కనిష్ఠానికి పడిపోయింది. గత 10 ట్రేడింగ్‌ సెషన్లలోనే రూపాయి విలువ 90 నుంచి 91కి రావడం గమనార్హం. భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యం వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతినడంతో రూపాయిపై ప్రతికూల ప్రభావం పడుతోందని అనలిస్టులు చెబుతున్నారు. మార్కెట్‌ ఒడుదొడుకులు, డాలర్‌కు డిమాండ్‌ పెరగడం వంటివి కారణాలుగా పేర్కొంటున్నారు.10¹

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande