ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 20 న అనకాపల్లి పర్యటన
అనకాపల్లి, 19 డిసెంబర్ (హి.స.) , : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 20న అనకాపల్లి జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ పర్యటన వివరాలను నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పీలా గోవిందసత్యనారాయణ గురువారం వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసం నుంచి ఉదయం 10 గంటలకు హెల
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 20 న అనకాపల్లి పర్యటన


అనకాపల్లి, 19 డిసెంబర్ (హి.స.)

, : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 20న అనకాపల్లి జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ పర్యటన వివరాలను నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పీలా గోవిందసత్యనారాయణ గురువారం వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసం నుంచి ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. తాళ్లపాలెం పంచాయతీ బంగారయ్యపేటకు 11.15 గంటలకు చేరుకుంటారు. స్థానికంగా ఓ ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. గ్రామంలో నిర్వహించే స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొంటారు. సుమారు గంటన్నరసేపు గ్రామస్థులతో సమావేశమవుతారు. జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటారు. గంటసేపు తెదేపా కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం జలగలమదుం కూడలిలో ఏర్పాటు చేసిన అటల్‌ బిహారీ వాజపేయీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో తిరుగుపయనం అవుతారని గోవింద సత్యనారాయణ చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande