
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ను సమన్వయం చేసుకుని వారిని బుజ్జగించడంలో విఫలమైన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మేము ముగ్గురం చర్చించామని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రెబల్స్ ను సమన్వయం చేయలేని, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జులపై అసహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సరిగా పని చేయని 18 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..