
అమరావతి, 20 డిసెంబర్ (హి.స.)రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలో 4.50 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ( ) అన్నారు. శనివారం నాడు విట్ యూనివర్సిటీలో జెన్ జెడ్ ( పోస్టాఫీసును కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. పోస్టల్ శాఖ ఉద్యోగులందరినీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే దేశంలోనే పటిష్టమైన శాఖగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ నిలుస్తుందన్నారు. లేటెస్ట్ టెక్నాలజీ రావడం వల్ల ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో సులభంగా తెలుస్తోందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ