53 వార్షిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న జోనల్ రైల్వే శిక్షణ సంస్థ, మౌలా - అలీ
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.) 53 వార్షిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న జోనల్ రైల్వే శిక్షణ సంస్థ, మౌలా - అలీ • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మౌలా -అలీలో ఉన్
53 వార్షిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న జోనల్ రైల్వే శిక్షణ సంస్థ, మౌలా - అలీ


హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)

53 వార్షిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న

జోనల్ రైల్వే శిక్షణ సంస్థ, మౌలా - అలీ

• ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ

మౌలా -అలీలో ఉన్న జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (జెడ్.ఆర్.టి.ఐ), ఈరోజు అనగా డిసెంబర్ 19, 2025న 53వ వార్షిక దినోత్సవాన్ని జరుపుకుంది. ¬దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ¬దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్; ¬దక్షిణ మధ్య రైల్వేకు చెందిన వివిధ శాఖల ప్రధానాధిపతులు ; హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా పాల్గొన్నారు. జెడ్.ఆర్.టి.ఐ ప్రిన్సిపల్ శ్రీ పి. భాస్కర్ రెడ్డి, సిబ్బంది మరియు శిక్షణార్థులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, జోనల్ రైల్వే శిక్షణ సంస్థ 53 సంవత్సరాల అంకితభావంతో కూడిన సేవలను పూర్తి చేసుకోవడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జనరల్ మేనేజర్ శిక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి పూర్తిగా ఆఫ్‌లైన్ శిక్షణా విధానం నుండి హైబ్రిడ్ మోడల్‌గా విజయవంతంగా మారినందుకు సంస్థను ప్రశంసించారు. స్టేషన్ మాస్టర్లు, కమర్షియల్ క్లర్క్‌లు మరియు ఇతరుల వంటి ఫ్రంట్‌లైన్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే సంస్థ, బలమైన పునాదిని నిర్మించడంలో మరియు సిబ్బంది పని నియమాలు మరియు నిబంధనలపై బాగా ప్రావీణ్యం కలిగి ఉండేలా చూసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో, శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శిక్షణార్థుల కోసం ట్రాఫిక్ మోడల్ రూమ్ & ఇండోర్ జిమ్ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఆయన పర్యావరణహిత వాతావరణాన్ని ప్రోత్సహించే దిశలో భాగంగా ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఇంకా, జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ అప్లికేషన్‌ను ఆయన ప్రారంభించి 2026 సంవత్సరానికి సంబందించిన వార్షిక శిక్షణా కార్యక్రమాన్ని కూడా విడుదల చేశారు. జనరల్ మేనేజర్ శిక్షణలో టాపర్‌లను అభినందించారు మరియు వారికి పతకాలు మరియు మెరిట్ సర్టిఫికెట్‌లను అందజేశారు. వార్షిక స్పోర్ట్స్ మీట్ విజేతలు మరియు రన్నరప్‌లకు రోలింగ్ షీల్డ్‌లను కూడా ఆయన ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా, దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్; దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శ్రీమతి కె. పద్మజ; దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ శ్రీమతి ఇతి పాండే మరియు దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ శ్రీ సిద్ధార్థ్ కటి కూడా సభలో ప్రసంగించారు.

ముందుగా, జోనల్ రైల్వే శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ శ్రీ భాస్కర్ రెడ్డి సంస్థ వార్షిక నివేదికను సమర్పించారు. 2025 సంవత్సరంలో రైల్వే ఉద్యోగులకు వివిధ వర్గాలకు శిక్షణ ఇవ్వడంలో సంస్థ అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఆయన వివరించారు. ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ, పొగమంచు వాతావరణ జాగ్రత్తలు మరియు తాజా సవరణలపై భద్రతా కేటగిరీ సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి సంస్థ ఆర్.ఈ.కె.ఏ.పి (రైల్వే ఉద్యోగుల నాలెడ్జ్ ఆగ్మెంటేషన్ ప్రోగ్రామ్ ) ప్రత్యేక కోర్సును ప్రవేశపెట్టిందని ఆయన తెలియజేశారు. జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బృందం 2025 సంవత్సరంలో, 8365 మంది శిక్షణార్థులకు శిక్షణ ఇచ్చిందని ఆయన చెప్పారు. ప్రైవేట్ స్టేషన్ మాస్టర్లకు కూడా శిక్షణ ఇచ్చామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర సీనియర్ అధికారులు కూడా ప్రసంగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande