మహేశ్వరం నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ సర్పంచ్ లు, మరియు ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్ లను సన్మానించిన బీజేపీ
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.) రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావ్ గారు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు, స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్
మహేశ్వరం నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ సర్పంచ్ లు, మరియు ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్ లను సన్మానించిన బీజేపీ


హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.) రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావ్ గారు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు, స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన ముఖ్యంశాలు

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సర్పంచులుగా, ఉపసర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచిన వారిని రాష్ట్ర పార్టీకి, ప్రజలకు పరిచయం చేసే కార్యక్రమం ఇది.

ఈ సందర్భంగా బీజేపీ నుంచి సర్పంచులుగా, ఉపసర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచిన వారందరికీ రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

వాస్తవంగా ఈ రోజు గ్రామాలు కొంతైనా అభివృద్ధి చెందుతున్నాయంటే, అది గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి కృషి కారణంగానే జరుగుతోంది.

గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సంవత్సరానికి మూడు విడతలుగా, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మొత్తం రూ. 6,000లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతోంది. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీలను కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఉచిత బియ్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, రోడ్ల నిర్మాణం, ఉపాధి హామీ నిధులు, గ్రామాల్లో రైతు వేదికలు, అంగన్వాడీ కేంద్రాలు, అంతర్గత రహదారులు వంటి అనేక అభివృద్ధి పనులను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇటీవల పార్లమెంటులో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన చట్టాన్ని ఆమోదింపజేసి, సంవత్సరానికి గరిష్ట పనిదినాల సంఖ్యను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచిన ఘనత కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారికే దక్కుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 100 రోజుల ఉపాధి హామీ కల్పించాలనే లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి కూడా ఉపాధి హామీ నిధులను వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ప్రస్తుతం గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు, అలాగే పార్టీ పోలింగ్ బూత్ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మోర్చాల అధ్యక్షులందరూ కలిసి రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని గ్రామాల ప్రజలతో సమన్వయం చేసుకుంటూ గెలుపు దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కమలం గుర్తుపై ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, మనమంతా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

అదేవిధంగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు తెలంగాణలోని ఇతర కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచేలా కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందుదొందేనని విమర్శించారు. ఇటీవల ఒక పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరడం ద్వారా తమను గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. బీఆర్ఎస్ జెండాపై గెలిచి, సిగ్గువిడిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ జరుగుతున్నప్పుడు తాము పార్టీ మారలేదని మాట మారుస్తున్నారని విమర్శించారు. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుచేటు విషయమని పేర్కొన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వారందరికీ తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవులు కూడా పొందారని గుర్తు చేశారు. ఇటీవల స్పీకర్ గారు, కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల గురించి వారు కాంగ్రెస్‌లో చేరలేదని, బీఆర్ఎస్‌లోనే ఉన్నారని చెప్పడం అన్యాయమని అన్నారు. స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ధర్మబద్ధంగా, రాజకీయాలకు అతీతంగా, న్యాయబద్ధంగా, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని, కానీ అది జరగడం లేదని విమర్శించారు. అందుకే ఈ రెండు పార్టీలకు రాజ్యాంగం అంటే గౌరవం లేదని, పార్టీ ఫిరాయింపుల చట్టంపై చిత్తశుద్ధి లేదని అన్నారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నాయని ఆరోపించారు. సర్పంచులందరూ ఎంతో పట్టుదలతో పనిచేసి గ్రామాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన కుటుంబ పాలనగా, అవినీతి పాలనగా సాగిందని, ప్రస్తుతం గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహా పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. అందుకే రాష్ట్ర రాజకీయాల్లో అవినీతిరహిత, సమర్థవంతమైన పాలన కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. ప్రతి కార్యకర్త కమలం గుర్తుతో ఇంటింటికి వెళ్లి, నరేంద్ర మోదీ గారి సుపరిపాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande