మహిళలు, చిన్నారుల రక్షణ కోసం.. డబ్ల్యూ & సీఎస్ డబ్ల్యూ
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)* మహిళలు చిన్నారుల భద్రతకు సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన పర్యవేక్షణలో 13.12.2025 నుంచి 19.12.2025 వరకు అనేక చర్యలు చేపట్టారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ నిర్వహించిన ప్రత్యేక దాడు
మహిళలు, చిన్నారుల రక్షణ కోసం.. డబ్ల్యూ & సీఎస్ డబ్ల్యూ*


హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)*

మహిళలు చిన్నారుల భద్రతకు సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన పర్యవేక్షణలో 13.12.2025 నుంచి 19.12.2025 వరకు అనేక చర్యలు చేపట్టారు.

యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో ఆరుగురు సెక్స్ వర్కర్లు, 11 మంది ట్రాన్స్‌జెండర్లను అదుపులోకి తీసుకున్నారు. 2 పిటా కేసులు నమోదు చేశారు. ఆరుగురు బాధితులను పోలీసులు రక్షించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

షీ టీం బృందాలు ఈ వారం మొత్తం 137 డెకాయ్ ఆపరేషన్లు చేశారు.

బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర ప్రవర్తనకు పాల్పడిన 66 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. మహిళల నుండి అందిన 23 ఫిర్యాదులను స్వీకరించారు.

ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ / సీడిఇడబ్ల్యూ కేంద్రాలు భార్యాభర్తల వివాదాల పరిష్కారంలో 22 కుటుంబాలను తిరిగి కలిపి వారి జీవితాల్లో కొత్త వెలుగులను నింపారు.

సైబరాబాద్ పరిధిలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, షీ టీం బృందాలు ఈ వారంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా మొత్తం 7229 మంది పాల్గొన్నారు. ముఖ్యంగా మానవ అక్రమ రవాణా, బాలల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మికులు, వేధింపులు, సామాజిక మాధ్యమాల్లో వేధింపులు, సైబర్ బెదిరింపులు, సైబర్ మోసాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

మహిళల హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, డయల్ 100, నేరాలు 1930 వంటి సేవల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande