
గుంతకల్లు), 20 డిసెంబర్ (హి.స.):క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అజ్మీర్-యల్హంక ప్రత్యేక రైలు (09601) ఈ నెల 20, 27, తేదీల్లో (శనివారాల్లో) రాత్రి 8-15 గంటలకు అజ్మీర్‌లో బయల్దేరి ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు యల్హంకకు చేరుకుంటుందన్నారు. బెంగళూరు-అజ్మీర్ ప్రత్యేక రైలు (09602) ఈ నెల 22, 29 తేదీల్లో (సోమవారా బెంగళూరు లో రాత్రి 10 గంటలకు బయల్దేరి బుధవారం సాయంత్రం 5-05 గంటలకు అజ్మీర్‌కు చేరుకుంటుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ