
హనుమకొండ, 20 డిసెంబర్ (హి.స.)
హన్మకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలో జరపనున్న మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల జాతరను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో అయినవోలు మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... జనవరి 13 నుండి మార్చి 19 వరకు మల్లికార్జున స్వామి ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, కలెక్టర్ స్నేహ శబరీష్, ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు