
నంద్యాల, 19 డిసెంబర్ (హి.స.)
జిల్లా ముత్యాలపాడు గ్రామంలో జరిగిన సొసైటీ ఎన్నికల్లో భూమా విఖ్యాత్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే, భూమా విఖ్యాత రెడ్డి డెయిరీకి ఉన్న అప్పును చెల్లించాలంటూ డిఫాల్టర్ నోటీసులు ఇచ్చింది వియజ పాల డెయిరీ యాజమాన్యం. దీనిపై వివరణ ఇవ్వడానికి డెయిరీ వద్దకు వచ్చారు విఖ్యాత్ రెడ్డి. కానీ అక్కడ డైరీ యాజమాన్యం కానీ, దానికి బాధ్యత వహించే అధికారులు కానీ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో విఖ్యాత్ రెడ్డి ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ