
మచిలీపట్నం, 19 డిసెంబర్ (హి.స.): గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఆద్యంతం ఆనందభరితంగా సాగాయి. మూడోరోజు గురువారం ముగింపు వేడుకలో పూర్వవిద్యార్థులు సందడి చేశారు. పలు సేవాకార్యక్రమాలు, కళాశాల అభివృద్ధికి వితరణలతో.. సమాజ శ్రేయస్సు కోరుతూ చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఇక్కడ చదివి ఉన్నత స్థానాలకు ఎదిగి.. దేశ విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు విచ్చేసి.. అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థుల కలయికలు, గత స్మృతుల కలబోతలతో వేడుక కనుల పండువగా జరిగింది. ‘మా తరగతి ఇదే.. ఈ బెంచీలోనే కూర్చున్నాం.. ఇక్కడే ప్రశంసలందుకున్నానని’ ఒకప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.. గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందన సందేశం పంపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ