
అమరావతి, 19 డిసెంబర్ (హి.స.)తిరుమల పరకామణి విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కానుల లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళించాలని ధర్మాసనం ఆదేశించింది. పరకామణిలో చోరీకి సంబంధించి ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా టీటీడీకి హైకోర్టు ముఖ్య సూచనలు చేసింది. దొంగతనాలను అరికట్టేందుకు రెండు దశలలో సంస్కరణలు చేపట్టాలని సూచించింది. కానుకల లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించి ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అత్యాధునిక యంత్రాలను వినియోగించాలని టీటీడీకి స్పష్టీకరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ