
ఆసిఫాబాద్, 19 డిసెంబర్ (హి.స.) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో
కనిపించారు. విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. 17న జరిగిన తుది విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ అభ్యర్థి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆసిఫాబాద్ మండలంలోని చిలాటిగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుడైన ఏకొంకర్ మహేష్ ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యాడు. అయితే మహేష్ ఓటమి జీర్ణించుకోలేక మహేష్ తన మద్దతుదారులతో కలిసి శుక్రవారం గ్రామంలో ఓటర్ల ఇండ్లకు వెళ్లి మీరు మాకు ఓటు వేయలేదు.
కాబట్టి నేను మీకు ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దృశ్యాలను స్థానిక గ్రామస్తులు కొందరు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి. సోషల్ మీడియాలో పెట్టడంతో తీవ్ర వైరల్ గా మారింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు