
భద్రాద్రి కొత్తగూడెం, 19 డిసెంబర్ (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లింగగూడెంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో లలిత అనే గర్భిణి మరణించగా ఆమె మృతదేహాన్ని గ్రామంలోకి రాకుండా ఓ రాజకీయ పార్టీకి చెందిన స్థానిక కీలక నేత ప్రభాకర్ అనే వ్యక్తి అడ్డుకున్నారు. గర్భిణీ శవం గ్రామంలోకి వస్తే కీడు జరుగుతుందనే మూఢనమ్మకంతో అతడు అడ్డు చెప్పినట్టు మృతురాలి కుటుంబ సభ్యలు చెబుతున్నారు.
దీంతో రాత్రంతా మృతదేహాన్ని ఊరి బయటే పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా తెల్లవారుజామున అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు