
నిజామాబాద్, 19 డిసెంబర్ (హి.స.)
నిజామాబాద్ జిల్లాలో దొంగ నోట్ల కలకలం సంచలనం గా మారింది. వర్ని మండలంలోని కెనరా బ్యాంకుకు శుక్రవారం ఉదయం జలాల్పూర్ గ్రామానికి చెందిన ఓ రైతు పంట రుణం తిరిగి చెల్లించేందుకు వెళ్లాడు. అయితే, అతడు తీసుకెళ్లిన నగదులో సుమారు రూ.45 వేల విలువ చేసే నకిలీ నోట్లు ఉన్నట్లుగా బ్యాంకు సిబ్బంది గుర్తించి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే, రైతు ఆ నోట్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు ఇచ్చారనే విషయాపై స్పష్టత రాలేదు. కాగా, ఇటీవల తెలంగాణలోని పలు జిల్లాల్లో నకిలీ నోట్లు చలామణి అవుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు