
జగిత్యాల, 19 డిసెంబర్ (హి.స.)
చేపల వేటకెళ్ళి ప్రమాదవశాత్తు జారి
పడి వలలో చిక్కుకుపోయిన ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామానికి చెందిన దువ్వాక నర్సయ్య (63) అనే మత్స్యకారుడు.. గురువారం మధ్యాహ్నం గ్రామ శివారులోని వరద కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లాడు.
రాత్రి గడిచినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం వరద కాలువ సమీపంలో నర్సయ్యకు సంబంధించిన చెప్పులు గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వరద కాలువలోని మృతదేహాన్ని బయటకు తీశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు