
భద్రాచలం, 19 డిసెంబర్ (హి.స.)
పోలవరం ముంపు పేరుతో భద్రాచలం
నుంచి ఆంధ్రలో విలీనం అయిన ఐదు గ్రామ పంచాయతీలు తిరిగి భద్రాచలంలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం భద్రాచలం వచ్చిన ఆమె ముందుగా భద్రాద్రి రామయ్య దర్శనం చేసుకున్న అనంతరం స్థానిక కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ముంపుకు గురికాని పిచ్చుకులపాడు, కన్నాయుగూడెం, ఎటపాక, పురుషోత్తమపట్నం, గుండాల పంచాయతీలను ఆంధ్రాలో విలీనం చేసారని, ప్రజల ప్రయోజనాలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోకుండా విలీన ప్రక్రియ జరిగిందని మండిపడ్డారు. ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ ఉద్యమానికి తొలి అడుగు భద్రాచలం నుండే ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు