
హైదరాబాద్, 19 డిసెంబర్ (హి.స.)
మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి
రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అదృష్టం ఉంటే మంచి పదవి వస్తుందని అన్నారు. ఇన్ని రోజులు ఆగానని త్వరలోనే తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పారు. చాలా కాలంగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు.
కానీ ఇప్పుడు ఇవ్వడంలేదని అనేకసార్లు మీడియా సమావేశాల్లో అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు మంత్రి పదవిపై పాజిటివ్ గా మాట్లాడటంతో కోమటిరెడ్డికి పదవిపై ఏమైనా సంకేతాలు అందాయా అనే చర్చ జరుగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు