
హైదరాబాద్, 19 డిసెంబర్ (హి.స.)
నిషేధిత మావోయిస్టు పార్టీకి
తెలంగాణలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కి చెందిన 41 మంది మావోయిస్టు క్యాడర్ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో శుక్రవారం ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో చేరారు. ఈ లొంగుబాటుతో పార్టీకి కోలుకోలేని నష్టం వాటిల్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. లొంగిపోయిన వారిలో దాదాపు 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ , 21 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కోర్సా లచ్చు, కనికారపు ప్రభంజన్, అర్బన్ ఏరియా, పీడీఎస్యూ సభ్యుడితో పాటు ఆరుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, 12 మంది ఏరియా కమిటీ సభ్యులు, 23 మంది పార్టీ సభ్యులు ఉన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..