
హైదరాబాద్, 19 డిసెంబర్ (హి.స.)
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డు
భూముల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ మహమ్మద్ అజారుద్దీన్ సూచించారు. శుక్రవారం మాదాపూర్ లోని ఆలంఘిర్ మజీద్ ను మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఇతర మైనార్టీ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. మాదాపూర్ డివిజన్ గుట్టల బేగంపేట్ సర్వే నెంబర్ 1 నుండి 9వరకు ఉన్న వక్ఫ్ బోర్డు భూములను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ.. నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల విలువైన వక్ఫ్ బోర్డు భూములు కబ్జాలకు గురవుతున్నాయని, గుట్టల బేగంపేట్ సర్వే నెంబర్ 1 నుండి 9 వరకు ఉన్న సుమారు 90 ఎకరాల స్థలంలో కొందరు ఆక్రమణలకు పాల్పడ్డట్లు మా దృష్టికి వచ్చిందని, అలాంటి వాటిని ఎంతమాత్రం సహించబోమని అన్నారు.వక్ఫ్ బోర్డు భూముల రక్షణకు మైనార్టీ వెల్ఫేర్ మినిస్ట్రీ మాత్రమే కాకుండా సంబంధిత శాఖల అధికారులు కూడా శ్రద్ధ పెట్టాలని స్థలాలను కాపాడాలని మంత్రి సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు