
హైదరాబాద్, 19 డిసెంబర్ (హి.స.)
ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు,
డీలర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్కు రావద్దు అనేదే మా తాపత్రయం. అందుకే జీవో నెంబర్ 41 కింద ఈవీ పాలసీ తీసుకొచ్చాం. ఇప్పటివరకు 1,59,304 ఈవీ వాహనాలకు రాయితీ ఇచ్చాం. ఇందుకు రూ.806.35 కోట్ల వరకు ఖర్చు చేశాం. ప్రభుత్వం నష్టపోయినప్పటికీ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తోంది. 2047 నాటికి పూర్తిగా ఈవీ వాహనాలు కావాలనేది మా కోరిక అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు