
హైదరాబాద్, 19 డిసెంబర్ (హి.స.)
రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో
పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. గెలుపు కోసం సర్పంచ్ అభ్యర్థులు ఎక్కని గడప లేదు అన్నట్లుగా ప్రచారం నిర్వహించారు. కొన్ని కొట్ల మద్యం ఏరులై పారగా.. మరికొన్నిచోట్ల డబ్బు ప్రభావం పని చేసింది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఓ చిత్రం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండల పరిధిలోని కీరియా తండా పంచాయతీ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి బోడ గౌతమి కి కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. అయితే, సర్పంచ్ అభ్యర్థి బోడ గౌతమికి ఒక్క ఓటు కూడా పడకపోవడం పట్ల ఆమె ఓటును ఆమె వేసుకోలేదా అని అటు గ్రామస్థులు.. మరియు అధికారులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఒక్క ఓటు కూడా పడని సర్పంచ్ అభ్యర్థి గౌతమి తన ఓటు ఎవరికి వేసినట్టు మరి అని అందరూ అనుమానం ప్రయత్నం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..