
హైదరాబాద్, 19 డిసెంబర్ (హి.స.)
సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా కేటీఆర్ విజయోత్సవ సభలు నిర్వహిస్తుండటం చూసి జాలేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఇవాళ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కేటీఆర్ జిల్లాల పర్యటనలు చేపడుతుండటం హాస్యాస్పదమని అన్నారు. ఓడిపోయిన సర్పంచ్లను ఓదార్చడానికి ఓదార్పు యాత్రలు చేస్తున్నారా అని సెటైర్లు వేశారు. అసమర్థుడి జీవయాత్రలా కేటీఆర్ టూర్లు ఉన్నాయని కామెంట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిందని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు