ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేస్తాం: వర్ధన్నపేట ఎమ్మెల్యే
వరంగల్, 19 డిసెంబర్ (హి.స.) ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని కాలనీలలో అంతర్గత రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్
వర్ధన్నపేట ఎమ్మెల్యే


వరంగల్, 19 డిసెంబర్ (హి.స.) ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని కాలనీలలో అంతర్గత రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులకు సుమారు 2కోట్ల 70 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఆయా డివిజన్లలో పర్యటించిన ఎమ్మెల్యే నేరుగా ప్రజలతో మాట్లాడి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన ప్రతి కాలనీలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.

ఇప్పటికే నియోజవర్గంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. శంకుస్థాపన చేసిన అనతి కాలంలోనే పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande