
వేములవాడ, 19 డిసెంబర్ (హి.స.)
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో రమాదేవి మరో వివాదంతో తెరపైకి వచ్చారు. విధి నిర్వహణలో భాగంగా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆలయ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈవో రమాదేవి సమయానికి మించి తమతో పని చేయిస్తుందని, ఉద్యోగులు సిబ్బందికి మధ్య వివాదాలు సృష్టించేలా వ్యవహరిస్తుందని, ఈవో తీరుతో తాము మానసికంగా కృంగిపోతున్నామని, తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఉద్యోగులు వారి గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. ఉద్యోగుల సమస్యల పట్ల స్పందించిన ఆది శ్రీనివాస్ నాలుగు రోజుల్లోగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు