
వరంగల్, 19 డిసెంబర్ (హి.స.)
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర
ప్రధానన్ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య శుక్రవారం న్యూఢిల్లీలో కలిశారు. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో అమలవుతున్న రుసా 2.0 (రిసెర్చ్ & ఇన్నోవేషన్) ప్రాజెక్టుల గడువు పెంచాలని వినతి పత్రం అందించారు. కాకతీయ యూనివర్సిటీలో రుసా 2.0 కింద మొత్తం రూ. 50 కోట్లు మంజూరు కాగా, ఇందులో రూ. 35 కోట్లు పరిశోధన ప్రాజెక్టులకు, రూ. 15 కోట్లు ఎంటర్ప్రైన్యూర్షిప్, ఉద్యోగ అవకాశాల పెంపు, ఇన్నోవేషన్ హబ్ కోసం కేటాయించారని ఎంపీ మంత్రికి వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు