
కృష్ణా జిల్లా, 19 డిసెంబర్ (హి.స.)
, వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువు అర్జున్ రెడ్డి ఈరోజు (శుక్రవారం) గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారంటూ గత ఏడాది అర్జున్ రెడ్డిపై గుడివాడలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆ కేసులో సోమవారం రాత్రి పోలీసుల నుంచి అర్జున్ రెడ్డి నోటీసులు అందుకున్నారు. విచారణ నిమిత్తం నేడు గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అర్జున్ రెడ్డి హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ