
అమరావతి, 19 డిసెంబర్ (హి.స.)
మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మాణించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ విధాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఈ మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించింది. ఈ ప్రతులను గవర్నర్‌కు అప్పగించి ప్రభుత్వం పునరాలోచన చేసేలా ఆదేశాలివ్వాలని కోరింది.
అయితే ఈ కార్యక్రమం ఫెయిల్ అయిందని సీఎం చంద్రబాబు అన్నారు. మెడికల్ కాలేజీల వ్యవహారంలో జగన్ డ్రామాకు తెరతీశారని విమర్శించారు. పీపీపీ విధానంపై ఎంపీలందరూ దేశ రాజధాని ఢిల్లీలో స్థాయిలో అధ్యయనం చేయాలని సూచించారు. కూటమి ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమ పథకాల విషయంలో జగన్‌కు ఎదురుదెబ్బలు ఎక్కువగా తగులుతున్నాయన్నారు. పీపీపీ విధానాన్ని జగన్ మాత్రమే వ్యతిరేకిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV