
హైదరాబాద్, 19 డిసెంబర్ (హి.స.)
సాఫ్ట్ వేర్ ఉద్యోగులను టార్గెట్ గా
చేసుకుని గంజాయి సరఫరా చేస్తున్న నిందితుడిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఐటీ ఉద్యోగులను టార్గెట్ గా గంజాయి సరఫరా చేస్తున్న సోహెల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద నుంచి 17 కిలోల గంజాయి, ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి గంజాయి తెచ్చి ఐటీ ఉద్యోగులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సోహెల్తో పాటు గంజాయి వినియోగించిన కన్స్యూమర్లను 5 మంది కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..