
సంగారెడ్డి, 19 డిసెంబర్ (హి.స.) సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత 15
రోజులుగా చలి పంజా విసురుతోంది. రోజురోజుకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చలి తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. జిల్లా పరిధిలోని కోహిర్ పట్టణంలో శుక్రవారం 5.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, జహీరాబాద్ (అల్గుల్)లో 6.4 డిగ్రీలు, మల్చల్మేలో 7.1 డిగ్రీలు, ఝరాసంగం లో 7.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికి తోడు ఉదయం పూట శీతల గాలులు వీయడం, మంచు కురవడం తో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.పలు ప్రాంతాల్లో చలి తీవ్రత కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..