
గుడివాడ, 19 డిసెంబర్ (హి.స.)
వైస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు బంధువైన అర్జున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ అలాగే వారి కుటుంబ సభ్యుల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారనే ఆరోపణలతో గత ఏడాది ఆయనపై కేసు నమోదైంది.
ఈ కేసులో భాగంగా ఇటీవల పోలీసులు అర్జున్ రెడ్డికి నోటీసులు జారీ చేసారు. ఈ కేసులో అర్జున రెడ్డి విచారణకు హాజరైన సమయంలో గుడివాడలో పోలీసులు అరెస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV