
తిరువనంతపురం : కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి ఈ ఏడాది మండల-మకరవిలక్కు సీజన్‌లో తొలి 15 రోజుల్లో రూ.92 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) వెల్లడించింది. గతేడాది ఇదే సీజన్‌లో రూ.69 కోట్లు వసూలయ్యాయని, ఈ దఫా ఆదాయం 33.33 శాతం పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది అత్యధికంగా అయ్యప్ప ప్రసాదం విక్రయాల నుంచి రూ.47 కోట్లు సమకూరినట్లు టీడీబీ వివరించింది. హుండీ ఆదాయం గత సంవత్సరంతో పోల్చుకుంటే 18.18 శాతం పెరిగిందని వెల్లడించింది. గతేడాది మండల-మకరవిలక్కు సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నవంబరు 30 వరకు దాదాపు 13 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు బోర్డు తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ