కేంద్రం సంచలన నిర్ణయం… ఇక ఇండియాలో నాలుగు బ్యాంకులే..
ముంబై, 2 డిసెంబర్ (హి.స.)కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. బ్యాంకింగ్ రంగంలో మరో భారీ మార్పుకు శ్రీకారం చుడుతోంది. బ్యాంకుల మలి విడత విలీన ప్రక్రియను చేపట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఐదేళ్ల క్రితం 27 ప్రభుత్వ రంగ బ్యాంకు
Central government steps towards merger of mega banks in India


ముంబై, 2 డిసెంబర్ (హి.స.)కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. బ్యాంకింగ్ రంగంలో మరో భారీ మార్పుకు శ్రీకారం చుడుతోంది. బ్యాంకుల మలి విడత విలీన ప్రక్రియను చేపట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఐదేళ్ల క్రితం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 12కు తగ్గించారు. అయితే ఈ 12 బ్యాంకుల విలీన ప్రక్రియ చేపట్టి నాలుగు బ్యాంకులుగా చేయాలని కేంద్ర ఆర్ధికశాఖ సమాలోచనలు చేస్తోంది. 2026-27 ఆర్ధిక సంవత్సరం కల్లా ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని చూస్తోంది. అందుకనుణంగా అడుగులు వేస్తోంది.

విలీనం తర్వాత కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా-యూనియన్ బ్యాంక్ విలీనం తర్వాత ఏర్పడే మరో బ్యాంక్ మాత్రమే ఉండనున్నాయి. అంటే ఇండియాలో ఇక నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను మాత్రమే మనం చూడనున్నామన్నమాట. తొలుత చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయనున్నారు. ఆనంతరం వాటిని నాలుగు బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. ఎస్‌బీఐలో ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ విలీనం చేయనుండగా.. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలను కలిపి ఒకే బ్యాంక్‌గా మార్చనున్నారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande