
కర్నూలు, 2 డిసెంబర్ (హి.స.)చలికాలం వచ్చిందంటే వణికించే చల్లని గాలులు, పొగమంచుతో శరీరం చాలా ఇబ్బంది పడుతుంది. ఈ చలిని తట్టుకోవడానికి మనం రకరకాల పద్ధతులు అవలంబిస్తాం. మందపాటి బ్లాంకెట్లు, హీటర్లు, బ్లోయర్లు, ఎలక్ట్రిక్ హీటర్ బ్యాగులు, రూమ్ హీటర్లు, గది మూసుకుని వేడి నిలువ చేసుకోవడం. కొందరు రాత్రంతా హీటర్ ఆన్ చేసి హాయిగా నిద్రపోతారు.
కానీ ఈ సౌకర్యం వెనుక దాగి ఉన్న ప్రమాదాలు ఎవరికీ తెలియవు! ఆక్సిజన్ తగ్గడం, చర్మం పొడిబారడం నుంచి ఫైర్ హజార్డ్ వరకు హీటర్‌తో చాలా ప్రమాదం ఉంది. గదిలో హీటర్ పెట్టుకుని నిద్రపోతే కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం..
హీటర్ గదిలోని గాలిని వేడి చేస్తుంది కానీ ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తుంది. రాత్రంతా మూసిన గదిలో హీటర్ పెడితే మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా తలనొప్పి, మైకం, ఉదయాన్నే అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి.
హీటర్ గాలిలోని తేమను పీల్చేస్తుంది. చర్మం పొడిబారడం, పెదవులు పగులు, దురద, అలర్జీలు మొదలవుతాయి. దీర్ఘకాలంలో చర్మం ముడతలు పడుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV