కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు సుప్రీంకోర్టులో ఊరట
హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.) కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూప్పకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పోక్సో కేసులో విచారణ కొనసాగించడానికి అనుమతి ఇస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్
యడ్యూరప్ప


హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.)

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

యడ్యూప్పకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పోక్సో కేసులో విచారణ కొనసాగించడానికి అనుమతి ఇస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు అన్ని ట్రయల్ కోర్టుల్లో కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే ఓ మహిళ సాయం కోసం తాను యడ్యూరప్ప నివాసానికి వెళ్లగా తనతో పాటు తన 17ఏళ్ల కుమార్తెను లైంగికంగా వేధించాడని ఆరోపించింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande