
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Garamond;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
.
ఢిల్లీ ,02, డిసెంబర్ (హి.స.)రోహింగ్యా శరణార్థుల అదృశ్యంపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా.. సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి.. న్యాయస్థానం అసాధారణ రక్షణలు కల్పించాలా అని ప్రశ్నించింది.
రోహింగ్యా (Rohingya)లు అదృశ్యమవుతున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ‘వారికి రెడ్‌కార్పెట్ వేసి.. ఆహ్వానించాలని మీరు కోరుకుంటున్నారా’ అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. రోహింగ్యాలు సొరంగ మార్గాల ద్వారా భారత్‌లోకి వచ్చి.. ఆహారం, ఆశ్రయం వంటి హక్కులను డిమాండ్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. ‘ఉత్తర భారతదేశంలో మనకు చాలా సున్నితమైన సరిహద్దు ఉంది. చొరబాటుదారులు చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తే.. వారిని ఇక్కడ ఉంచాల్సిన బాధ్యత మనకు ఉందా?’ అని వ్యాఖ్యానించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ