
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.cf4{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}
చెన్నై /ఢిల్లీ ,02, డిసెంబర్ (హి.స.)మెట్రో రైలు సబ్‌వేలో చిక్కుకుపోయింది (Chennai Metro Train Stuck In Subway). విమ్కో నగర్ డిపో నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్లే మెట్రో ట్రైన్ సెంట్రల్ మెట్రో - హైకోర్టు స్టేషన్ మధ్యలో ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వారు మధ్యలోనే దిగి రైల్వే ట్రాక్‌పై నడవాల్సి వచ్చింది. సెంట్రల్ మెట్రో - హైకోర్టు స్టేషన్ మధ్యఉన్న మెట్రో రైలు బ్లూ లైన్‌లో సాంకేతిక లోపం, విద్యుత్తు సరఫరాలో సమస్య వల్ల ఈ అసౌకర్యం తలెత్తినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పది నిమిషాల పాటు సబ్‌వేలో మెట్రో ట్రైన్ (Chennai Metro Train) నిలిచిపోయిందని.. దీంతో పట్టాల మీదుగా 500 మీటర్ల దూరంలో ఉన్న హైకోర్టు మెట్రో స్టేషన్‌కు నడిచివెళ్లాలని అధికారులు కోరినట్లు ప్రయాణికులు వెల్లడించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చెన్నై మెట్రో అధికారులు క్షమాపణలు కోరారు. బ్లూ లైన్‌లో సమస్యను పరిష్కరించడంతో రైలు సేవలు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు. 3
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ