
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)
అగ్నిపథ్ పథకంలో (Agnipath Scheme) భాగంగా నియామకమయ్యే అగ్నివీరులకు (Agniveer Recruitment) కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మాజీ అగ్నివీరులకు సరిహద్దు భద్రతా దళం (BSF) నియామకాల్లో రిజర్వేషన్ కోటాను పెంచింది. ప్రస్తుతం ఈ కోటా 10 శాతం ఉండగా దానిని 50 శాతానికి పెంచింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. త్రివిధ దళాల్లో నియామకాలకు సంబధించి కేంద్ర ప్రభుత్వం 2022లో అగ్నిపథ్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీరులుగా వారి నాలుగేళ్ల స్రవీస్ ముగిసిన తర్వాత రిజర్వేషన్ ద్వారా కేంద్ర పారామిలటరీ బలగాల్లో నియమించుకుంటున్నారు. ఇందులో భాగంగా కేంద్ర సాయుధ పోలీసు దళాల్లోని కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఖాళీలలో 10 శాతం కోటా మాజీ అగ్నివీరులకు కేటాయించారు. తాజాగా బీఎస్ఎఫ్ నియామకాల్లో 10 శాతం ఉన్న రిజర్వేషన్ ను 50 శాతానికి పెంచారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..