తెలంగాణపై చలి పంజా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు!
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.) తెలంగాణలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. అటు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఇటు మైదాన ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా పటాన్చెరులో 7 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయ
చలి


హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)

తెలంగాణలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. అటు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఇటు మైదాన ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా పటాన్చెరులో 7 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు ప్రభావం తో రాత్రి నుంచి ఉదయం వరకు ప్రజలు బయటకు రావడానికి గజగజ వణికిపోతున్నారు.

రాబోయే ఐదు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఇంకా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వేడి దుస్తులు ధరించాలని వైద్యులు కోరుతున్నారు. మంచు కురుస్తున్నందున వాహనదారులు ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం అవసరం అని సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande