
సూర్యాపేట,20 డిసెంబర్ (హి.స.) సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటన నేపథ్యంలో పోలీసు శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగం ని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాకప్లో రాజేష్ మృతి చెందిన ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఈ ఘటన రీత్యా అప్పటి కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డిని ఇటీవల బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రూరల్ సీఐ పై కూడా చర్యలు తీసుకోవడం గమనార్హం.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు