
ఆసిఫాబాద్, 20 డిసెంబర్ (హి.స.)
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ అన్నారు. శనివారం ఉదయం వాంకిడి పోలీస్ స్టేషనన్ను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లో పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదిదారుడితో. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు