అస్సాంలో రూ. 10,600 కోట్లతో ఎరువుల ప్లాంట్కు ప్రధాని మోడీ భూమిపూజ
గువాహటి, 21 డిసెంబర్ (హి.స.) భారత ప్రధాని నరేంద్ర మోడీ అసోం పర్యటిస్తునలో భాగంగా ఆదివారం డిబ్రూగఢ్ జిల్లాలోని నమ్రూప్లో సుమారు రూ. 10,600 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ''అసోం వ్యాలీ ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్'' (AVFCCL) అమ్మోనియా-య
ప్రధాని మోడీ


గువాహటి, 21 డిసెంబర్ (హి.స.)

భారత ప్రధాని నరేంద్ర మోడీ అసోం

పర్యటిస్తునలో భాగంగా ఆదివారం డిబ్రూగఢ్ జిల్లాలోని నమ్రూప్లో సుమారు రూ. 10,600 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 'అసోం వ్యాలీ ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్' (AVFCCL) అమ్మోనియా-యూరియా ప్రాజెక్టుకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు అసోం, ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక పురోగతిలో ఒక మైలురాయి అని, దశాబ్దాలుగా నమ్రూప్ ప్రజలు కంటున్న కల నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అంతకుముందు గువాహటిలో కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్ను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అసోం అభివృద్ధిలో కొత్త వేగాన్ని పుంజుకుందని ఆయన అన్నారు.

రైతు సంక్షేమంపై తన నిబద్ధతను చాటుతూ, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నమ్రూప్లోని పాత ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, అయితే తమ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించి సరికొత్త టెక్నాలజీతో ఈ ప్లాంట్ను నిర్మిస్తోందని ప్రధాని చెప్పుకొచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande