జంట హత్య కేసులో. వైసిపి నేతలు పిన్నెల్లి.సోదరుల.రిమాండ్ పొడిగింపు
అమరావతి, 25 డిసెంబర్ (హి.స.) నరసరావుపేట, : జంట హత్యల కేసులో వైసీపీ నేతలు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి జనవరి 7 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ జూనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు
జంట హత్య కేసులో. వైసిపి నేతలు పిన్నెల్లి.సోదరుల.రిమాండ్ పొడిగింపు


అమరావతి, 25 డిసెంబర్ (హి.స.)

నరసరావుపేట, : జంట హత్యల కేసులో వైసీపీ నేతలు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి జనవరి 7 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ జూనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. గురువారం నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న వీరిని మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి ప్రశాంత్ వర్చువల్‌గా విచారించారు. అనంతరం వారి రిమాండ్‌ను పొడిగించారు.

2025 మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. తమకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ పిన్నెల్లి సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. అందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిని సవాల్ చేస్తూ.. వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande