
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.) శంషాబాద్ జోనల్ కమిషనర్ గా
కే.చంద్రకళ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇప్పటివరకు చేవెళ్ల ఆర్డీవోగా బాధ్యతలు నిర్వర్తించారు. శంషాబాద్ ను జిహెచ్ఎంసి జోన్ గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆమెను జోనల్ కమిషనర్ గా సర్కారు నియమించింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆమె తన ఆఫీసును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..